అసభ్యకర రీతిలో ఇండియన్ ఆర్మీ డ్రెస్ - ఏక్తా కపూర్‌పై కేసు

Webdunia
మంగళవారం, 19 మే 2020 (09:20 IST)
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై కేసు నమోదైంది. భారత సైనికులు ధరించే దుస్తుల(యూనిఫాం)ను అసభ్యకర రీతిలో చూపించండంతో ఆమెపై ఈ కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన విశాల్ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బాలాజీ టెలీఫిలింస్ నిర్మించిన ఓ వెబ్‌సిరీస్‌లో ఇండియన్ ఆర్మీ డ్రెస్‌ను అభ్యంతరకర రీతిలో చూపించారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు విశాల్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్మీ యూనిఫాంను అపహాస్యం చేశారన్నారు. 
 
ఫేస్‌బుక్ పేజీలో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారన్నారు. ఓ ఆర్మీ అధికారి భార్య, వేరే వ్యక్తికి మధ్యనున్న సంబంధాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. పూర్తి వివరాలను పరిశీలించి ఏక్తాకపూర్‌కు నోటీసులు పంపుతామని వెల్లడించారు.
 
గతంలో కూడా ఏక్తా కపూర్ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. సంచలం కోసం లేదా తాము నిర్మించే సినిమాలు, టెలీ సీరీస్‌లు, వెబ్ సిరీస్‌లు సంచలనం కోసం ఈ తరహా వివాదాలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆజ్యం పోస్తూవుంటారు. ఆ కోవలోనే ఇపుడు ఏక్తా కపూర్ వివాదం కూడా చేరినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments