Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ల‌ర్ ఫోటో ఫేం సుహ‌స్ ఫ‌స్ట్ లుక్

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (15:42 IST)
Suhaan
మ‌జిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ, క‌ల‌ర్‌ఫోటో లాంటి చిత్రాల్లో న‌టించిన సుహాస్ తాజాగా ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ ఈరోజు విడుద‌ల‌చేసింది చిత్ర‌యూనిట్‌. సుహాస్ హీరోగా మెహె‌ర్ తేజ్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమ‌వుతూ తేజా కాస‌ర‌పు తో క‌లిసి నిర్మిస్తున్న చిత్రం ఫ్యామ‌లి డ్రామా. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఛ‌ష్మా ఫిలింస్ మ‌రియు నూత‌న భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్లు నిర్మిస్తున్నారు. థ్రిల్ల‌ర్ క్రైమ్ డ్రామా గా తెర‌కెక్కుతున్న ఈ  సినిమాకి స్టోరి, స్క్రీన్ ‌ప్లే ని మెహె‌ర్ తేజ్ మ‌రియు ష‌ణ్ముఖ ప్ర‌సాంత్ లు అందిస్తున్నారు.
 
కంచె, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణ లాంటి చిత్రాల‌కి ఎడిట‌ర్ గా ప‌నిచేసిన రామ‌కృష్ణ ఆర్రామ్ ఈ ఫ్యామిలి డ్రామా కి ఎడిటింగ్ చేస్తున్నారు. అజ‌య్ అండ్ సంజ‌య్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ లుక్ లో సుహ‌స్ కంచె వెనుక వుండ‌టం, వీల్ ఛైర్ పై ఒక‌రు ఎదురుగా ఒక‌రు టైటిల్ కి అటు ఇటు గా వుండేలా ఒక డిఫ‌రెంట్ ఫ్యామిలి డ్రామా ని తెర‌కెక్కించార‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. అలాగే టైటిల్ కూడా ఒక బ్లేడ్ తో క‌టింగ్ వ‌చ్చేలా డిజైన్ చేయ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఫ్యామిలి డ్రామా అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచ‌డంతో పాటు సోష‌ల్ మీడియా ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబందించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

బిచ్చగాళ్లపై మిజోరం సర్కారు ఉక్కుపాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments