Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ: వ‌కీల్ సాబ్ చూసేందుకు హైదరాబాద్ థియేటర్లో 20 మంది

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (15:56 IST)
Vakeel sab working
క‌రోనా వ‌ల్ల నిన్న తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఎగ్జిబిట‌ర్లు, పంపిణీదారులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ `వ‌కీల్ సాబ్‌`ను ప్ర‌ద‌ర్శించాల‌ని, మిగిలిన థియేట‌ర్ల‌ను మూసివేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం వారికే బెడిసికొట్టేట్లు క‌నిపిస్తుంది. రెండోవారంలోకి ప్ర‌వేశించి ఈ సినిమా క‌లెక్ష‌న్లు అప్ప‌డే ప‌ల‌చ‌గా వున్నాయి. అయినా సినిమాను ప్ర‌ద‌ర్శిస్తూనే వున్నారు. నిన్న తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం మ‌ల్టీ ప్లెక్స్‌లు మాత్ర‌మే మూసివేయాల‌నీ, మామూలు థియేట‌ర్లు తెరిచివుంచుకోవ‌చ్చ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇప్పుడు మామూలు థియేట‌ర్ల‌లో రేపు శుక్ర‌వారం అన‌గా 23వ తేదీన శుక్ర సినిమా, ఇప్ప‌టికే వ‌ర్మ దెయ్యం సినిమాల‌తోపాటు ఒక‌టి రెండు డ‌బ్బింగ్ సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతున్నాయి. అయినా వ‌ర్మ దెయ్యం సినిమాకు మొద‌టి నుంచి పెద్ద‌గా క‌లెక్ష‌న్లు లేవు. క‌నుక కొన్ని ప్రాంతాల్లో శుక్ర సినిమాను ఆడించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ‌‌
 
నిన్న జ‌రిగిన ఎగ్జ‌బిటర్ల స‌మావేశంలో కేవ‌లం వ‌కీల్‌సాబ్‌ను ప్ర‌ద‌ర్శిస్తే ముందుముందు కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయ‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తే అందుకు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో పెద్ద పెద్ద పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్లు ఆ సినిమాకు సంబంధించిన‌వారే. అయితే గ‌త రెండు రోజులుగా వ‌కీల్‌సాబ్‌కు క‌లెక్ష‌న్లు భారీగా ప‌డిపోయాయి.

నిన్న హైద‌రాబాద్‌లోని చాలా చోట్ల అస్స‌లు జ‌నాలే లేరు. ఓ థియేటర్లో 10 మంది కూర్చుని సినిమా చూసారు. క్రాస్‌రోడ్‌లో ప‌ట్టుప‌ని ప‌దిమంది కూడా లేకుండా థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలిసింది. అదేవిధంగా బోడుప్ప‌ల్, మారేడ్‌ప‌ల్లి, అత్తాపూర్ వంటి చోట్ల అస్స‌లు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఇక ఈ విష‌యంలో ప్ర‌ధాన పంపిణీదారుడు, ఎగ్జిబిట‌ర్ దిల్‌రాజు కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments