Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో జరిగే విషయాలు మీడియాకెలా లీక్ అవుతున్నాయి : చిరంజీవి ఆరా

తన ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగే చర్చలు మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయంటూ తన అనుచరులకు మెగాస్టార్ చిరంజీవి క్లాస్ పీకినట్టు సమాచారం.

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (12:56 IST)
తన ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగే చర్చలు మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయంటూ తన అనుచరులకు మెగాస్టార్ చిరంజీవి క్లాస్ పీకినట్టు సమాచారం. ముఖ్యంగా తన అల్లుడు కళ్యాణ్‌ను వెండితెరకు పరిచయం చేసేందుకు మెగా ఫ్యామిలీ కసరత్తు చేస్తోంది. 
 
ఇందులోభాగంగా, అల్లుడి అరంగేట్రంపై చిరంజీవి ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. నిర్మాత సాయి కొర్ర‌పాటి తీసుకొచ్చిన క‌థ న‌చ్చ‌డంతో క‌ల్యాణ్ లాంచింగ్ బాధ్య‌తలు అత‌నికి అప్ప‌గించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను తీసుకునేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 
 
త్వ‌ర‌లో ఆమె క‌థ విన‌బోతున్న‌ట్టు స‌మాచారం. అన్నీ ప‌క్కాగా కుదిరాకా క‌ల్యాణ్ లాంచింగ్ పంక్ష‌న్‌ను చిరంజీవి భారీగా నిర్వ‌హించాల‌నుకున్నార‌ట‌. అప్పుడే మీడియాకు కూడా ప‌రిచ‌యం చేద్దామనుకున్నార‌ట‌. అయితే చర్చ‌ల ద‌శలోఉండ‌గానే ఆ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దీంతో చిరంజీవి ఫీల‌వుతున్న‌ట్టు సమాచారం.
 
కాగా, ప్రస్తుతం చిరంజీవి ప్ర‌స్తుతం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న 'సైరా' సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్నో క‌స‌ర‌త్తులు చేసి శ‌రీరాన్ని మార్చుకున్నారు. ఈ సినిమా కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, హీరో రాం చరణ్ నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments