Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కల్యాణ్ దేవుడా.. అతను అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి: మహేష్ కత్తి

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పవరేంటో చూపిస్తున్నారు. తన వ్యాఖ్యల ద్వారా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. అధికార వర్గం, విపక్షాలనే తేడా లేకుండా విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertiesment
పవన్ కల్యాణ్ దేవుడా.. అతను అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి: మహేష్ కత్తి
, శుక్రవారం, 8 డిశెంబరు 2017 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పవరేంటో చూపిస్తున్నారు. తన వ్యాఖ్యల ద్వారా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. అధికార వర్గం, విపక్షాలనే తేడా లేకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేసే కామెంట్లపై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తున్నాడు. 
 
కాటమరాయుడు సినిమాపై మహేష్ కత్తి చేసిన కామెంట్స్.. పవన్ ఫ్యాన్స్‌తో వార్ మొదలెట్టింది. అప్పటి నుంచి మహేష్ కత్తిపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతనికి ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారు. అప్పటి నుంచి పవన్‌‌పై మరిన్ని మాటల తూటాలు పేలుస్తున్న మహేష్ కత్తి... తాజాగా జనసేనాని పర్యటన సందర్భంగా చేసిన కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు. 
 
తండ్రి సీఎం అయితే కుమారుడు సీఎం కావాలని రూలుందా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మహేష్ కత్తి తప్పుపట్టాడు. ట్విట్టర్లో ''నిజమే తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఏమీలేదు. అలాగే అన్న హీరో అయితే తమ్ముడూ హీరో అవ్వాలని లేదుగా వారసత్వం మన ఫ్యూడల్ భావజాలపు బానిస భావన. అది అన్ని రంగాల్లో పోవాలి. కాకపోతే ఎర్ర గురివింద తన నలుపెరగనట్టు మాట్లాడితేనే నవ్వొస్తుంటుంది" అంటూ కౌంటరిచ్చాడు. 
 
టీడీపీ, బీజేపీకి ఇక మద్దతిచ్చేది లేదన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై.. ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్... చలో అంటూ సెటైర్ వేశాడు. అంతేగాకుండా.. మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట. అది కాంగ్రెస్‌తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పాడు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది? అని మహేష్ కత్తి ప్రశ్నించాడు. 
 
తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి. పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కత్తి స్పందించాడు. ట్విట్టర్లో ముందు మీ ఫ్యాన్స్ చేస్తున్న గుండాయిజాన్ని ఆపే మంచి పనిచెయ్యి. లేకపోతే, తప్పో పొరపాటో కాదు, మీకు మీ పార్టీకి అదొక గ్రహపాటుగా మారే చాన్స్ ఉంది.. అంటూ సూచనలు ఇచ్చాడు. అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం. అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకో...రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాడు. గ్రౌండ్ రియాలిటీ గ్రహించి మాట్లాడు. పవన్ అజ్ఞాత వాసి కాదు.. అజ్ఞానవాసి అంటూ మహేష్ కత్తి సెటైర్ల వర్షం కురిపించారు.
 
ఇక ఓ చర్చా కార్యక్రమంలో మహేష్ కత్తి మాట్లాడుతూ.. కాటమరాయుడు సినిమాపై కామెంట్స్ చేస్తే, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మా దేవుడిని అంటావా? అని పవన్ ఫ్యాన్స్ అడిగారు. తాను ప్రజాస్వామ్యంలో బతుకుతున్నానని ఓ వ్యక్తిని దేవుడ్ని చేసే మూర్ఖత్వం తనలో లేదని మహేష్ కత్తి ఘాటుగా స్పందించారు. ఏ విషయంలోనూ క్లారిటీ లేకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారని తెలిపారు. 
 
ఎవడో గొట్టంగాడినంటే తన్నెందుకు పట్టించుకున్నారని.. పవన్ ఫ్యాన్స్ తనపై దాడి చేస్తున్నారని.. ఫోన్ ఆన్ చేస్తే రోజుకు 500 కాల్స్ వస్తున్నాయని తెలిపారు. పవన్ ఫ్యాన్స్ బండబూతులతో తనను ఇప్పటికీ బెదిరిస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో సామాన్య వ్యక్తిగా పవన్‌ను ప్రశ్నిస్తున్నానని.. తన వెనుక ఏ పార్టీ లేదని కత్తి మహేష్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో?