Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమ్ముడూ... ఇప్పుడా విషయం నీకెందుకు? పవన్‌కు చిరు సూటి ప్రశ్న?

మెగా అన్నదమ్ముల మధ్య నిన్న రాత్రి ఆసక్తికరమైన ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి ఆ పార్టీని నాశనం చేసిన ఏ ఒక్కరిని

తమ్ముడూ... ఇప్పుడా విషయం నీకెందుకు? పవన్‌కు చిరు సూటి ప్రశ్న?
, శనివారం, 9 డిశెంబరు 2017 (18:06 IST)
మెగా అన్నదమ్ముల మధ్య నిన్న రాత్రి ఆసక్తికరమైన ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి ఆ పార్టీని నాశనం చేసిన ఏ ఒక్కరిని వదలనని, వారందరూ తనకు బాగా గుర్తున్నారని పవన్ చెప్పిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
 
పవన్ అంతటితో ఆగలేదు.. తన అన్నకు అన్యాయం చేసిన వారి పేర్లు తనకు తెలుసునని వారిలో సగంమంది తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారం ఎప్పటిదో. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్‌ ఆ పార్టీ గురించి, ఆ పార్టీలో నేతలు చిరంజీవిని మోసం చేసిన విధానం గురించి మాట్లాడటమే ఇప్పుడు నలుగురిలో జరుగుతున్న చర్చ. 
 
ఒక పార్టీకి అధినేత అయిన పవన్ కళ్యాణ్‌ ఇలా మాట్లాడటంపై చర్చ జరుగుతుండగానే చిరంజీవి నిన్న రాత్రి పవన్ కళ్యాణ్‌‌కు స్వయంగా ఫోన్ చేశారట. పవన్ ఎందుకలా మాట్లాడావంటూ అడిగారట. ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు.. మనం పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా వ్యవహరించాలే తప్ప ఎప్పటి విషయాలో మళ్ళీ తోడుకోకూడదనీ, ఇది మనకు చాలా ముఖ్యమనీ చెప్పారట. అంతేకాకుండా ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం ముందుగా మనం నేర్చుకోవాలనీ, ఇప్పటివరకు జరిగిన విషయాల్ని ఇక మరిచిపొమ్మనీ, ప్రజారాజ్యం పార్టీ గురించి గాని ఆ పార్టీ వల్ల మనకు జరిగిన అన్యాయం గురించి గాని ఇంకెక్కడా దయచేసి మాట్లాడవద్దని చెప్పినట్లు సమాచారం.
 
ఇలా ఇద్దరూ 20 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారట. అయితే అన్నపై ఎంతో ప్రేమ ఉన్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరు ఏం చెబుతున్నా సరేనంటూ ఊ కొడుతూ వచ్చారట. మరి చూడాలి పవన్ కళ్యాణ్‌ అన్న చెప్పినట్లుగా వెనక్కి తగ్గుతారో.. లేకుంటే తన పంథాతో కొనసాగుతారో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను మగాడినే... ఐతే ఆ నపుంశకుడికి ఆ పరీక్షలు చేయాల్సిందే... ఎవరు?