Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ప్రొసీడ్ అన్నారు - 1997 మోషన్ పోస్టర్ సంద‌ర్భంగా కోటి

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (16:53 IST)
Mohan, srikath addala, naveen etc
డా. మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో డా. మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ హైరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. 
 
అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, టైటిల్ చాలా బాగుంది. 1997 తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ,.ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు నాకు ఈ కథ చెప్పారు. కథ వినగానే చేయాలని అనిపించింది. ఇది హీరోనా, చిన్న పాత్ర అన్నది కాకుండా ఓ మంచి పాత్ర చేసానన్న తృప్తి కలిగింది. మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు, ముఖ్యంగా నటుడిగా కూడా అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తే ఆయననుండి  మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి అన్నారు.
 
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, మోహన్ నాకు కొడుకుగా నటించాడు. అప్పటినుండి తనతో అదే అనుబంధం కొనసాగుతుంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. నేను పోలీస్ కావాలని మా నాన్నగారికి కోరిక ఉండేది, అది ఎలాగూ జరగలేదు కాబట్టి ఇలా పోలీస్ పాత్రల ద్వారా అయినా ఆ కోరిక తీరింది. నేను పోలీస్ గా దేవినేని సినిమాలో చేశాను. అప్పటినుండి చాలామంది పోలీస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ఒకరోజు చిరంజీవి గారు నువ్వు నటుడిగా పనికి వస్తావు ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో నేనుకూడా యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాను. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అన్నారు. 
 
హీరో మోహన్ మాట్లాడుతూ, ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్ర కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. ఆయన చిన్న పాత్రయినా చాలా చక్కగా చేశాడు. అలాగే బెనర్జీ గారు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఓ బర్నింగ్ ఇష్యుని  తీసుకుని ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments