Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆర్జీవీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:21 IST)
టాలీవుడ్ స్టార్స్ గురువారం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటలో భాగంగా సినీ పరిశ్రమని రక్షించమని, థియేటర్స్‌ని రక్షించమని ప్రాధేయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అయితే చేతులెత్తి దండం పెట్టి సినిమా పరిశ్రమని కాపాడండి అని వేడుకున్నారు. 
 
మిగిలిన వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడారు. అయితే ఈ వీడియోలు చూసిన వారంతా మెగా స్టార్ రేంజ్ ఆయన అలా ఒక నాయకుడి దగ్గర అడుక్కోవడం చూడటానికి చాలా కష్టంగా ఉందని అంటున్నారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కూడా ట్వీట్ చేశారు. 
 
"సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్‌ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ని నేను అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
 
అంతకుముందే రామ్ గోపాల్ వర్మ.. "ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా" అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేశారు. కేవలం ఆర్జీవీ మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులంతా తమ హీరోలు వెళ్లి అలా మాట్లాడటంతో చాలా బాధపడ్డారు.  
 
మంత్రి పేర్నినాని భేటీ సందర్భంగా ఆర్జీవీ చట్టబద్దంగా లాజికల్‌గా మాట్లాడటం, మెగా స్టార్ ఏమో అలా చేతులెత్తి వేడుకోవడం చూసి అందరూ దీనిపై మాట్లాడుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇది మన హక్కు, మన హక్కుని మనం అడుక్కోవటం ఏంటని గట్టిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments