ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగు ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన సన్నహాకాలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు.
ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాల్లో కూడా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారని చెప్పారు. అంటే కొత్త జిల్లాలకు కూడా పాత కలెక్టర్లే విధులు నిర్వహిస్తారు. కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూదని ఆయన చెప్పారు.
ఉగాది నాటికల్లా ఉద్యోగుల విభజన, అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తి కావాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా, కొత్త జిల్లాల ఏర్పాటులో అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నపుడు వాటిని నిశితంగా పరిశీలన చేయాలని ఆయన కోరారు. జిల్లా పరిషత్‌ల విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.