Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి - బాబి కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా...

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (09:01 IST)
మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ఆయన చేతిలో అనేక చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. అలాగే, మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్‌లో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ మూవీ వేదాళం  రీమేక్‌లో నటించనున్నారు. 
 
ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప‌నులు సైలెంట్‌గా జ‌రిగిపోతున్నాయి. ఈ సినిమాలు కాకుండా మ‌రో సినిమాను చిరంజీవి ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అధికారికంగా అనౌన్స్ చేశారు. అది కూడా ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. బాబి. 
 
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి స్టేజ్‌పై అధికారికంగా ప్ర‌క‌టించారు. 
 
పైగా, ఈ అవకాశాన్ని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బాబి దర్శకత్వంలో వచ్చే చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ కూడా ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్పుడు చిరంజీవి సినిమాలు చేస్తున్న స్పీడు చూస్తే.. వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments