నేను ఎవ్వరినీ శిష్యునిగా చేర్చుకోను: 'ఉప్పెన'లో సుకుమార్‌

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (23:11 IST)
Sukumar, Vijay Sethupati
నా దగ్గర అసిస్టెంట్‌గా చేసేవారు దర్శకులు అయ్యారు. ఎవరినీ శిష్యుడు అని నేను చెప్పను. ఎవరోవచ్చి నేర్చుకుని వెళ్లిపోతుంటారు. ఇక్కడ ఎవరికీ నేర్పలేం. అందరూ నేర్చుకుంటారు. నేనూ నేర్చుకున్నా’’ అని దర్శకుడు సుకుమార్‌ తెలిపారు. ఆయన దగ్గర పనిచేసిన బుజ్జిబాబు ‘ఉప్పెన’ సినిమా ద్వారా దర్శకుడు అయ్యాడు. కానీ ఆయనను ప్రత్యేకంగా శిష్యుడని అన్నారు. అదెలాగో చూద్దాం.
 
బుజ్జిబాబు నువ్వు నా శిష్యుడివి. ఎందుకంటే నేను నీకు లెక్క‌లు చెప్పేవాడిని. వాళ్లింట్లో వాళ్ళ అమ్మగారు అంటుండేది. వాడితోటి వారంతా సాఫ్ట్‌వేర్‌లో జాబ్‌ చేస్తూ కారులో తిరుగుతున్నారని. పర్లేదు అమ్మా! అంటూ సర్దిచెప్పేవాడిని. అయినా నాలో అబద్ధం చెప్పాననే గిల్ట్‌ వుండేది. కానీ ఒకసారి ఉప్పెన కథ పట్టుకుని వచ్చాడు బుజ్జిబాబు. ఆ కథ విన్నాక 100 కోట్ల సినిమా అని చెప్పాను.

తనకు అన్నీ కలిసివచ్చాయి. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వైష్ణవ్‌ ఫొటో చూసి హీరోగా కావాల‌న్నాడు. అలాగే కృతి వచ్చింది. విజయ్‌ సేతుపతి గురించి చెప్పాంటే పెద్ద డ్రామా. చెన్నై వెళ్ళి కలిశాడు. మరలా హైదరాబాద్‌ వచ్చాక కలిసి కథ చెప్పాడు. డేట్స్‌ లేవు. తర్వాత నేను విజయ్‌ను కలిసి మీరెందుకు ఇంత మంచి కథలో చేయకూడదు అని అడిగాను. బుజ్జిబాబు ఎమోషన్స్‌ నా ఎమోషన్స్‌ అర్థం చేసుకుని విజ‌య్‌సేతుప‌తి ఒప్పుకున్నాడు. అలాగే దేవీశ్రీప్రసాద్ కూడా జాయిన్ అయ్యాడు. ఇలా అందరూ కలిసి మంచి సినిమా చేశారు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఉపాధ్యాయులకు నియామక లేఖలు పంపిణీ - లోకేష్

Nandamuri Balakrishna: చిరంజీవిని పిలిచి సైకో జగన్ అవమానించారు.. బాలయ్య (video)

కాళేశ్వరం కుంభకోణం : సీబీఐ దర్యాప్తు ప్రారంభం.. బీఆర్ఎస్‌లో గుబులు మొదలు

అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న ఎమ్మెల్యేలు.. సీరియస్ అయిన చంద్రబాబు

మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments