చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ ఎపుడో చెప్పేశారు!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (15:07 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇపుడు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఈ నెల 9వ తేదీ నుంచి చిత్రం షూటింగ్ తిరిగి మొదలవుతుందని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో బుధవారం అధికారికంగా ప్రకటించింది.
 
లాక్డౌన్ అనంతరం, పక్కాగా రక్షణ చర్యలు తీసుకుని, ఈ నెల 9 నుంచి తిరిగి షూటింగును నిర్వహించడానికి ఉత్తేజభరితంగా ఉన్నామని సదరు సంస్థ తెలిపింది. ఇది నెల రోజుల భారీ షెడ్యూలనీ, ఇందులో చాలా భాగం చిత్రీకరణ పూర్తవుతుందన్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లో సందడి చేస్తుందని విడుదల విషయాన్ని కూడా ప్రకటించారు.
 
కాగా, సామాజిక ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిత్ర నిర్మాత, హీరో అయన రాం చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో చిరంజీవికి పలు సినిమాలలో హిట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments