Webdunia - Bharat's app for daily news and videos

Install App

"విక్రమ్" చిత్రబృందాన్ని అభినందించిన మెగాస్టార్

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (11:22 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం ఈ నెల మూడో తేదీన విడుదలై మెగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, విదేశాలకు హాలిడే టూర్‌ కోసం వెళ్లి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. 
 
ఇందులో తన స్నేహితుడు, అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ చిత్రాన్ని ఇటీవల ఆయన వీక్షించారు. ఆ సినిమా తనకెంతగానో నచ్చడంతోపాటు, బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందాన్ని అభినందిస్తూ చిరు పార్టీ ఇచ్చారు. 
 
శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో కమల్‌హాసన్‌, ‘విక్రమ్‌’ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, నితిన్‌ పాల్గొన్నారు. ఇక, ఇదే పార్టీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సైతం సందడి చేశారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత ‘విక్రమ్‌’తో వెండితెరపై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన కమల్‌కు శాలువా కప్పి చిరు సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.
 
'విక్రమ్‌' విజయానికి అభినందిస్తూ "నా ప్రియ నేస్తం కమల్‌హాసన్‌ను సన్మానించడం ఆనందంగా ఉంది. ‘విక్రమ్‌’ విజయవంతమైన సందర్భంగా సల్మాన్‌ఖాన్‌, లోకేశ్‌ కనకరాజు ఇతర బృందానికి నిన్న రాత్రి నా నివాసంలో పార్టీ ఏర్పాటు చేశాం. వాట్‌ ఏ థ్రిల్లింగ్‌ ఫిల్మ్‌. మై ఫ్రెండ్‌.. నువ్వు మరింత శక్తిమంతం కావాలని కోరుకుంటున్నా' అని చిరు రాసుకొచ్చారు. 
 
ఇక, చిరంజీవి ప్రస్తుతం మలయాళీ రీమేక్‌గా సిద్ధమవుతున్న ‘గాడ్‌ఫాదర్‌’లో నటిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూట్‌ కోసమే సల్లూభాయ్‌ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చివున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments