Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ కొత్త షెడ్యూల్‌కు సిద్ధం

Bhola Shankar, Chiranjeevi
, గురువారం, 9 జూన్ 2022 (19:59 IST)
Bhola Shankar, Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కలయికలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “'భోళా శంకర్” కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. 'మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం''అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
 
మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవిని మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు.  
 
ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.
 
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా,  ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
ఈ ఏడాది చివర్లో భోళా శంకర్  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. .
 
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.
 
సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డూడ్లే
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో : వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్  సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సీఎం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే..- NBK107 ఫస్ట్ హంట్ వ‌చ్చేసింది