Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ బిడ్డగా పోలీసులకు సెల్యూట్ చేస్తున్న.. వైరల్ అయిన చిరు ట్వీట్ (Video)

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (15:20 IST)
రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ విధించగా, దాన్ని పక్కాగా అమలు చేస్తున్న పోలీసులకు చిరంజీవి అభినందనలు తెలిపారు. 
 
ఇప్ప‌టికే పోలీస్ వారి త్యాగాన్ని గుర్తించి వారికి నాగ చైత‌న్య‌, మ‌హేష్ బాబు సెల్యూట్ చేయ‌గా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. పోలీస్ బిడ్డ‌గా పోలీస్ వారికి సెల్యూట్ చేస్తున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.
 
చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోను పరిశీలిస్తే, "రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల ప‌నితీరు అద్భుతం. నిద్రాహారాలుమాని వాళ్ళు ప‌డుతున్న క‌ష్టం అంతా ఇంతా కాదు. నేను హైద‌రాబాద్‌లో స్వ‌యంగా చూస్తున్నాను. వారి ప‌నితీరు వ‌ల‌న లాక్‌డౌన్ స‌క్సెస్‌ఫుల్‌గా జ‌రుగుతుంది. 
 
అలా జ‌ర‌గ‌బ‌ట్టే క‌రోనా విజృంభ‌ణ చాలా అదుపులోకి వ‌చ్చింది. అలాగే సామాన్య జ‌నం కూడా పోలీసులకి స‌హ‌కరించాలి. కరోనాని అంత‌మొందించేందుకు వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. పోలీస్ వారు చేస్తున్న ఈ అమోఘ‌మైన ప్ర‌య‌త్నాన్ని పోలీస్ బిడ్డ‌గా వారికి సెల్యూట్ చేస్తున్నాను అని చిరంజీవి త‌న ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. "మీరు కేవలం మమ్మల్ని మాత్రమే ప్రేరేపించలేదని... కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరినీ ప్రేరేపించారు. మీ నుంచి స్ఫూర్తిని పొందే ఎంతో మందిని మేల్కొలిపారు. ఒక పోలీసు కుటుంబం నుంచి వచ్చిన మీ నుంచి వచ్చిన మాటలు... కరోనాపై పోరాటంలో తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాయని డీజీపీ అన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments