Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారెన్స్‌కి రూ.10 లక్షల చెక్‍ని అందజేసిన మెగాస్టార్.. ఎందుకు?

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:11 IST)
మెగాస్టార్ చిరు, లారెన్స్ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి విదితమే. చిరు వీణ స్టెప్‌తో సహా లారెన్స్ చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో పని చేసి బోలెడు సూపర్ హిట్ స్టెప్స్ కంపోజ్ చేశారు. తాజాగా 'కాంచ‌న 3' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ అటెండ్ కాలేక‌పోయినా త‌న త‌ర‌పున ఒక ఏవీని, బహుమతిని పంపించారు. లారెన్స్ తనకు రెండున్నర దశాబ్ద కాలంగా తెలుసునని చెప్పుకొచ్చారు. 
 
"ముఠామేస్త్రి" సినిమాలో ఒక గ్రూప్ డ్యాన్స‌ర్‌గా ఒక మూల ఉండి డ్యాన్స్ చేశాడని, అప్పుడే అత‌డి ప్ర‌త్యేక‌త‌ను గుర్తించి అబ్జ‌ర్వ్ చేశానని, రెండేళ్ల తర్వాత ఆంటీ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారాడని, 1995లో 'హిట్ల‌ర్'‌లో అబీబీ అబీబీ సాంగ్‌కి కొరియోగ్ర‌ఫీ చేయ‌మ‌న్నప్పుడు, ఆ పాట ఇప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేశాడని, అంచెలంచెలుగా ఎదిగి నెంబర్ 1 స్థానం సాధించాడని చిరు ఆ ఏవీలో పేర్కొన్నారు.
 
 
'కాంచన 3' చిత్రం కూడా లారెన్స్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని చిరు అన్నారు. లారెన్స్ చెన్నైలో 200 మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాడు. 150 మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. 60 మంది పిల్ల‌ల వ‌ర‌కూ దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తున్నాడు. 
 
ఇప్పుడు ఆ ట్రస్ట్‌ను హైద‌రాబాద్‌లోనూ ప్రారంభించే ప్ర‌య‌త్నం చేస్తున్నందుకు గాను తన తరపున సాయంగా రూ.10ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టిస్తున్నట్లు చిరు ప్రకటించారు. లారెన్స్ లాంటి వాళ్లు మ‌రెంద‌రో రావాలి. స్ఫూర్తిగా నిల‌వాలి అని చిరు అన్నారు. ఈ చెక్‌ను లారెన్స్‌కు అల్లు అరవింద్ స్వయంగా అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments