Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తమ్ముడు'ని వెతుక్కుంటూ వెళ్లిన 'అన్నయ్య'... PSPK#25 సెట్‌లో సందడే సందడి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఈ వేడుకలను పీకే ఫ్యాన్స్ ఆయన అభిమానులు పండుగలా జరుపుకున్నారు. అలాగే, పీకేకు పలువురు సినీ ప్రముఖులు, నేతలు పుట్టినరోజు

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (14:44 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఈ వేడుకలను పీకే ఫ్యాన్స్ ఆయన అభిమానులు పండుగలా జరుపుకున్నారు. అలాగే, పీకేకు పలువురు సినీ ప్రముఖులు, నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, చిరంజీవి కూడా పవన్‌కు పుట్టిన రోజు నాడు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో తమ్ముడు ఉబ్బితబ్బిబ్బులై.. చిన్నపిల్లోడిలా మారిపోయాడు. 
 
నిజానికి చిరంజీవి .. పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. అయితే అవి రాజకీయపరమైన అభిప్రాయభేదాలే తప్ప, వాళ్లిద్దరి అనుబంధానికి సంబంధించినవి కావనే విషయం చాలాసార్లు స్పష్టమైంది. ఇక పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో అభిమానుల నుంచి గ్రీటింగ్స్ అందుకుంటూనే, శనివారం కూడా త్రివిక్రమ్ మూవీ షూటింగులో పవన్ పాల్గొంటున్నారు.
 
అయితే, బర్త్‌డే బాయ్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, చిత్ర యూనిట్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ చిరంజీవి దంపతులు షూటింగ్ స్పాట్‌లో ప్రత్యక్షమయ్యారు. అన్నావదిలను చూడగానే పవన్ ఆనందంతో పొంగిపోయారు. చిరూ దంపతులు పవన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నావదినల నుంచి పవన్ ఆశీస్సులు అందుకున్నారు. చిరు జంట రాకతో చిత్ర సెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments