మెగాస్టార్ చిరంజీవి తన 154 చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. సోమవారంనాడు సెట్‌కు హాజరై అక్కడ తొలుత కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ప్రకాష్‌రాజ్ కూడా కృష్ణంరాజుతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నటనాపరంగా కృష్ణంరాజును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
mega 154 unit
మెగా 154 చిత్రం రవీందర్ (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. రవితేజ ఓ పాత్రను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. కోనవెంకట్ సంభాషణలు రాస్తున్న ఈ చిత్రాన్ని సోనీమ్యూజిక్ సౌత్ సమర్పిస్తోంది.