Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతాన ప్రాప్తిరస్తు నుంచి చాందినీ చౌదరి ఫస్ట్ లుక్

డీవీ
బుధవారం, 23 అక్టోబరు 2024 (17:49 IST)
Chandni Chaudhary
విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “ఏబీసీడీ మూవీ, ” అహ నా పెళ్లంట” వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఆయన రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాంటీ డ్రగ్స్ యాడ్ ను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఏక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
 
ఈ రోజు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో చాందినీ చౌదరి కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత భాగస్వామిగా కావాలని, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ వద్దని ఆమె కోరుకుంటున్నట్లు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
 
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. ఆ సమస్యను “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో వినోదాత్మకంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్  షూటింగ్ జరుపుకుంటోంది.
 
నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్,  బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, అనిల్ గిలా,  కిరీటి, సద్దాం, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments