Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతిని ''పద్మావత్''గా మార్చండి.. అప్పుడే యూఅండ్ఎ సర్టిఫికేట్: సీబీఎఫ్‌సీ

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' కి లైన్ క్లియర్ కాబోతోంది. అయితే, సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటూ నిర్మాత, దర్శకుడికి కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. 'పద్మా

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (15:59 IST)
వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' కి లైన్ క్లియర్ కాబోతోంది. అయితే, సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటూ నిర్మాత, దర్శకుడికి కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. 'పద్మావతి' అనే పేరును 'పద్మావత్' గా మార్చాలని తెలిపింది. వివాదాస్పద ముద్ర వేసుకున్న పద్మావతి సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 
 
రాజ్ పుట్ మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు పద్మావతిలో వున్నాయని.. ఆ సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేయాల్సిందిగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఆ సినిమా నిర్మాత, దర్శకులకు సూచించింది. ఇక పద్మావతి అనే సినిమా టైటిల్‌ను ''పద్మావత్''గా మార్చాలని సీబీఎఫ్‌సీ షరతు విధించింది. అంతేగాకుండా ఈ చిత్రానికి యూఅండ్ఎ సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీ నిర్ణయించింది. 
 
మొత్తం సినిమాలో 26 సన్నివేశాలను కట్ చేస్తామని చెప్పింది. ఘూమర్‌ను, సతిని గొప్ప విషయంగా చూపించరాదని స్పష్టం చేసింది. భారతదేశంలోని ఏ రాష్ట్ర చరిత్రతో ఈ సినిమా కథకు సంబంధం లేదని ప్రకటించాలని సూచన చేసింది. సినిమా సన్నివేశాల మధ్యలో మూడు సార్టు ప్రకటనలు జోడించాలని చెప్పింది. సీబీఎఫ్‌సీ విధించిన నిబంధనలపై సినీ యూనిట్ స్పందించాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments