Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2017: భారతదేశ ప్రజలను బాధించిన ఆ సంఘటనలు...

మానవుడి నైజమే అంత. భవిష్యత్తును గురించి ఊహాగానాలు చేసుకోవడం, గత జ్ఞాపకాలను తలుచుకుని మురిసిపోవడం, చేదు జ్ఞాపకాలను చూసి కుమిలిపోవడం మామూలే. ఇంతకీ ఇప్పుడీ చర్చ ఎందుకయా అంటే... 2017 సంవత్సరాని మరో 10 రోజ

2017: భారతదేశ ప్రజలను బాధించిన ఆ సంఘటనలు...
, బుధవారం, 20 డిశెంబరు 2017 (16:04 IST)
మానవుడి నైజమే అంత. భవిష్యత్తును గురించి ఊహాగానాలు చేసుకోవడం, గత జ్ఞాపకాలను తలుచుకుని మురిసిపోవడం, చేదు జ్ఞాపకాలను చూసి కుమిలిపోవడం మామూలే. ఇంతకీ ఇప్పుడీ చర్చ ఎందుకయా అంటే... 2017 సంవత్సరాని మరో 10 రోజుల్లో వీడ్కోలు పలుకబోతున్నాం. ఈ నేపధ్యంలో మన భారతదేశాన్ని కాస్త బాధించిన అంశాలు ఏమిటో చూద్దాం. 
 
1. ప్రధాని ముందు ప్రియాంకా అలా... 
గత మే నెలలో జర్మన్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు కాలుపై కాలు వేసుకుని బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న వేళ, తన కాళ్లు చూపిస్తూ, కాలిపై కాలు వేసుకుని కూర్చోవడాన్ని పలువురు విమర్శించారు. అది కాస్తంత ఇబ్బంది కలిగించింది.

 
 

2. నవరాత్రి రోజున సన్నీ లియోన్ కండోమ్ ప్రకటన...
పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ అంటే కుర్రకారు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఐటమ్ సాంగ్ అంటే.. నోరెళ్ల బెట్టుకుని చూసేవారు ఎంతో మంది ఉన్నారు. నవరాత్రి పండుగ సందర్భంగా సన్నీ లియోన్ కండోమ్ ప్రకటనను పెద్దగా చూపిస్తూ రోడ్లపై హోర్డింగులు ఏర్పాటు చేయడంపై అప్పట్లో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
webdunia
 

3. గొర్రె మాంసం ప్రకటనలో గణేశుడు...
ఆస్ట్రేలియాలో గణేశుడిని గొర్రె మాంసం యాడ్‌లో ఉపయోగించారు. గ‌ణేషుడితోపాటు ఇత‌ర మ‌తాల‌కు చెందిన దేవుళ్లు గొర్రె మాంసం తింటున్న‌ట్లుగా ఉన్న ఆ ప్రకటనపై భారతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భార‌త హై క‌మిష‌న్ సిడ్నీలోని భార‌త కాన్సులేట్‌కు ఫిర్యాదు చేస్తూ ఈ యాడ్‌ను వెంట‌నే తొల‌గించాల‌ని కోరింది. అయితే తాము ప్రకటన రూపొందించే ముందు చాలామందిని సంప్ర‌దించి, ప‌రిశోధ‌న చేశామ‌నీ, దీనిపై ఇతర మత సంఘాలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రకటన రూపొందించిన కంపెనీ తెలిపింది.
webdunia
 
4. ఇర్ఫాన్ పఠాన్ భార్య ఫోటోను షేర్ చేయడంపై....
భారత వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ తన భార్య సఫా బేగ్ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీనికి కారణం ఇర్ఫాన్ తన భార్య ముఖాన్ని సగం కనిపించేలా పెట్టడమే. ఆ ఫోటోను షేర్ చేస్తూ ‘దిస్ గర్ల్ ఈజ్ ట్రబుల్’ అనే క్యాప్షన్ జోడించాడు. దాంతో నెటిజన్లు ఎడాపెడా కామెంట్లు గుప్పించారు. కొందరు ఇర్ఫాన్ చేసినది మంచిది కాదంటే మరికొందరు సమర్థించారు.
webdunia
 
5. పద్మావతి వివాదం... 
బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' వివాదం అలానే వుండిపోయింది. రాజ్‌పుత్ కర్ణిసేన ఈ చిత్రం విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌ జైపూర్‌ పట్టణంలోని నహర్‌ఘడ్‌ కోటలో ఈ బలవన్మరణం జరిగింది. "తాము తలలు నరకం - ఉరి తీసుకుంటాం" అని కోట గోడలపై రాసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మరోవైపు, చిత్తోర్‌గఢ్ కోటలోని పద్మినీ మహల్ ముందున్న ఓ పురాతన శిలా ఫలకాన్ని ఆర్కియాలజీ విభాగం అధికారులు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా మూసివేశారు. ఈ శిలాఫలకం మీద మొగల్ రాజు అల్లాఉద్దీన్ ఖిల్జీ, స్వయంగా రాణి పద్మావతిని చూశాడని ఉండటమే ఇందుకు కారణంగా ఉంది. ఈ శిలా ఫలకం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని, దీన్ని ధ్వంసం చేస్తామని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరించిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న అనుమానంతో ఈ ఫలకాన్ని మూసి వేసినట్టు అధికారులు వెల్లడించారు. మరి కొత్త ఏడాదిలోనైనా పద్మావతి విడుదలవుతుందా లేదా చూడాలి.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గుతున్న జగన్....