Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ సర్కారును 74 శాతం మంది నమ్ముతున్నారట.. ఇక తిరుగులేదా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును 74 శాతం మంది భారతీయులు నమ్ముతున్నారట. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

మోడీ సర్కారును 74 శాతం మంది నమ్ముతున్నారట.. ఇక తిరుగులేదా?
, సోమవారం, 20 నవంబరు 2017 (13:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును 74 శాతం మంది భారతీయులు నమ్ముతున్నారట. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 
 
ఇండియాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారన్న విషయమై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన తాజా సర్వేలో మోదీ సర్కారు టాప్-3 స్థానాన్ని దక్కించుకుంది.
 
"ప్రజలు అత్యధికంగా నమ్మిన ప్రభుత్వాల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా ఉంది. ఇండియాలోని మూడొంతుల మంది తమ దేశ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారు. ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక విధానం, పన్ను సంస్కరణలు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరో మెట్టు ఎక్కించాయి" అని కితాబిచ్చింది. 
 
సుమారుగా 74 శాతం మంది భారతీయులు మోడీ ప్రభుత్వంపై నమ్మకముందని వెల్లడించారని తెలిపింది. ఇక ఈ జాబితాలో తొలిస్థానంలో స్విట్జర్లాండ్ ఉండగా, రెండో స్థానంలో ఇండొనేషియా నిలిచింది. భారత్ తర్వాత లక్సెంబర్గ్, నార్వే, కెనడా, టర్కీ, న్యూజిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫిన్ ల్యాండ్, స్వీడన్, డెన్మార్క్, ఆస్ట్రేలియాలు ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగవారిని చంపడమే లక్ష్యంగా చంద్రబాబు : ఆర్కే. రోజా