Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ భద్రతపై నమ్మకం లేదట... ఇవాంక కోసం వైట్‌హౌస్ బలగాలు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ ఈనెలాఖరులో భారత పర్యటనకు రానుంది. ఇపుడు ఆమె భద్రత పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమెకు భద్రత కల్పించేందుకు వైట్‌హౌస్ రక్షణ అధికారులు భారత

భారత్ భద్రతపై నమ్మకం లేదట... ఇవాంక కోసం వైట్‌హౌస్ బలగాలు?
, మంగళవారం, 14 నవంబరు 2017 (09:48 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ ఈనెలాఖరులో భారత పర్యటనకు రానుంది. ఇపుడు ఆమె భద్రత పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమెకు భద్రత కల్పించేందుకు వైట్‌హౌస్ రక్షణ అధికారులు భారత్‌కు రానుండటం గమనార్హం. 
 
ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆమె పర్యటించనున్నారు. ఆ సమయంలో హెచ్ఐసీసీ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసింది. 
 
నిజానికి భారత్‌కు వచ్చే ఇవాంక భద్రతను తమకు వదిలేయాలని.. ఆమె సెక్యురిటీ అంతా తాము చూసుకుంటామంటూ కేంద్ర హోంశాఖతోపాటు ఎస్‌పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌)కు స్పష్టమైన సూచనలు జారీచేసింది. ఇందుకోసం అమెరికన్‌ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు సమాచారం.
 
అయితే, కేంద్ర హోంశాఖ మాత్రం మరో వాదనను వినిపిస్తోంది. ఇవాంక ట్రంప్‌ భద్రతతో పాటు దేశ ప్రధాని మోడీ భద్రత కూడా ముఖ్యమని, ఆయన వెనుక ఆర్మ్‌డ్‌ ఫోర్స్ ఉండాలని కేంద్ర హోం శాఖ వర్గాలు పట్టుబడుతున్నాయి. దీనికి అమెరికా భద్రతా బలగాలు అంగీకరించడం లేదు. గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్‌ కాల్పుల వ్యవహారంతో అమెరికన్‌ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను అమెరికా విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒప్పో ఫోన్లకు అదనంగా జియో 100 జీబీ డేటా