Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోట్ల రద్దు : రియల్ ఎస్టేట్ కుదేలు.. చితికిపోయిన చిన్నవ్యాపారులు

దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేసిన నేటికి సరిగ్గా యేడాది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేస్తున్నట్టు గత యేడాది నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిడుగులాంటి వార్త

నోట్ల రద్దు : రియల్ ఎస్టేట్ కుదేలు.. చితికిపోయిన చిన్నవ్యాపారులు
, బుధవారం, 8 నవంబరు 2017 (13:17 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేసిన నేటికి సరిగ్గా యేడాది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేస్తున్నట్టు గత యేడాది నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిడుగులాంటి వార్తను ప్రకటించారు. అంతే ఒక్కసారిగా డబ్బు చెలామణని పూర్తిగా ఆగిపోయింది. ఈ నిర్ణయంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అష్టకష్టాలు పడ్డారు. 
 
ముఖ్యంగా, సామాన్యులు, కూలీలతో ముడిపడి ఉన్న రంగాలపై ఈ నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది. మార్కెట్లకు ఊహించని దెబ్బ తగిలింది. దేశ ఆర్థిక రంగాన్ని నిర్ణయించే వాటిలో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒకటి. నిత్యం అమ్మకాలు, కొనుగోళ్లతో ఈ రంగం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. అదీకాక.. ప్రభుత్వానికి రోజూ ఆదాయం తెచ్చిపెట్టే రంగం కూడా ఇదే. 
 
ఈ రంగంలో బ్లాక్ మనీ విపరీతంగా నడుస్తుందని ఓ అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్టే.. అత్యధికంగా నగదు లావాదేవీలు.. రియల్ ఎస్టేట్ సెక్టర్‌లో జరుగుతుంటాయి. ఇలాంటి రంగానికి.. డీమానిటైజేషన్ నిర్ణయం షాకిచ్చింది. వాస్తవానికి బడాబాబుల్లో చాలా మంది తమ బ్లాక్‌మనీని రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిజిస్ట్రేషన్ విలువ కంటే.. మార్కె విలువే 3, 4 రెట్లు ఎక్కువగా చూసుకుంటారు. మార్కెట్ విలువను నల్లధనంతో కట్టేస్తారు. ఇలాంటి రంగం కూడా.. పెద్ద నోట్ల రద్దు బారిన పడింది.
 
ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకున్నా కనీసం రోజుకు 10 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ.. నోట్ల రద్దు నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. 4 నెలలపాటు దేశ వ్యాప్తంగా 90 శాతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ రంగానికి తగ్గట్టే నిర్మాణ రంగం కూడా.. ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ముంబై, ఢిల్లీ, పుణె, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో నిర్మాణ రంగం నెమ్మదించింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, మౌలిక వసతులకు సంబంధించిన నిర్మాణాలు, మాల్స్, బిల్డింగ్స్.. ఇలా అన్నీ నిర్మాణాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. 
 
నోట్ల రద్దు ప్రభావం మొదట చూపించింది రిటైల్ మార్కెట్ మీదే. పాల వ్యాపారం నుంచి ఇంటర్నేషనల్ పార్సిళ్ల వ్యాపారం వరకు.. అన్నిటికీ సడన్‌గా బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా నిత్యవసరాలు కొనుగోలు చేసే చిల్లర దుకాణాల వ్యాపారం ఉన్నట్టుండి కుంటుపడింది. క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారు మాల్స్‌లో షాపింగ్ చేయడం మొదలు పెట్టారు. దేశంలో సుమారు 5 కోట్ల మంది బతుకులు ఆధారపడిన చిల్లర కొట్ల వ్యాపారం దెబ్బతింది. డీ మానిటైజేషన్ నిర్ణయం.. రైతులకు కూడా కష్టాలనే మిగిల్చింది. పండించిన పంటకు అమ్మకాలు లేక.. తీవ్ర నష్టాలు మిగిలాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికుడిని కిందపడేసి ఇండిగో సిబ్బంది ఎలా కొడుతున్నాడో చూడండి (వీడియో)