Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలీచాలని దుస్తుల్లో అమలాపాల్.. ఆడైకి ''ఎ'' సర్టిఫికేట్..

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (17:11 IST)
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ తమిళంలో రాక్షసన్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమలాపాల్ తాజా చిత్రం వివాదానికి కారణమైంది. కోలీవుడ్‌లో ఇంతవరకు ఏ హీరోయిన్‌ చేయని పనిని అమలాపాల్ చేసిందట.
 
బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా అమలాపాల్ ''ఆడై'' అనే సినిమాలో అందాలను చూపెట్టేసిందని సెన్సార్ సభ్యులు చెప్పారట. పాత్రకు తగినట్లు నటించానే తప్ప.. గ్లామర్ కోసం కాదని అమలాపాల్ వివరణ ఇచ్చినా సెన్సార్ సభ్యులు మాత్రం ఆడై సినిమా ''ఎ'' సర్టిఫికేట్ ఇచ్చారు.  
 
ఇక లైంగిక హింస బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీలో అమలా పాల్ చాలా బోల్డ్‌గా నటించిందని ఇప్పటికే చెన్నైలో టాక్ జోరుగా ఉంది. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చాలీచాలని దుస్తుల్లో ఎవరితోనో శారీరక హింసకు గురికాబడిన టైపు‌లో ఇచ్చిన స్టిల్ బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 
 
ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి అధికారులు ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లలు చూసేందుకు ఇందులో కంటెంట్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని కట్స్ ఇచ్చాక కూడా ఎ సర్టిఫికేట్‌ను ఫిక్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం