"ఓ బేబీ"పై సమంత ఆసక్తికరమైన ట్వీట్.. నా కుమారుడు, మనవడు, బెస్ట్‌ ఫ్రెండ్‌?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (16:08 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత పెళ్లికి తర్వాత కూడా హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌తో అదరగొడుతోంది. తాజాగా సమంత ఓ బేబీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. 
 
ఇందులో సీనియర్‌ నటి లక్ష్మి కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు, తొలి లిరికల్‌ పాటకు విశేషమైన స్పందన లభించింది. జులై 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.   
 
తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఓ బేబీ" చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను సమంత ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 
 
‘ఎమోషనల్‌ రోలర్‌కోస్టర్‌ రైడ్‌కు సిద్ధం కండి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్టర్‌లో సమంత.. నా కుమారుడు, మనవడు, బెస్ట్‌ ఫ్రెండ్‌ అని రావు రమేశ్‌, తేజ, రాజేంద్రప్రసాద్‌లను చూపించడం ఆకట్టుకుంటోంది. 
 
ఇకపోతే.. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై రూపొందిన చిత్రం కోసం ఆరిస్టులు, సాంకేతిక బృందంలో మహిళలే ఎక్కువగా పని చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments