Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు "ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా" తెచ్చిన తంట...

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (18:42 IST)
అస్సలే వ్యక్తిగత సమస్యల్లో నలిగిపోతున్న హీరోయిన్ సమంతకు ఇపుడు ఒక కొత్త సమస్య వచ్చిపడింది. ఆమె సినీ ప్రేక్షకులను ఆనందపరిచాలన్న ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన "పుష్ప" చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. ఈ నెల 17వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. 
 
అయితే, ఈ ఐటమ్ సాంగ్ ఇపుడు వివాదాన్ని రేపింది. "ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా" అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాట వినేందుకు కాస్త వల్గర్‌నే ఉంటుంది. కానీ, వినేకొద్దీ అందులోని అర్థాన్ని గ్రహించవచ్చు. 
 
ఈ నేపథ్యంలో ఈ పాట లో మగవారిని కించపరిచే విధంగా లిరిక్స్ ఉన్నాయంటూ ఏపీ పురుష సంఘం ప్రతినిధులు ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. మగవారు మరీ చులకన బుద్ధి కలవారు అంటూ అందరి గురించి ఐటమ్ సాంగ్‌లో  ఉందని ఆ సంఘం ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
పైగా, ఈ పాటను తక్షణం నిషేధించాలని రాష్ట్ర హైకోర్టులో పురుషుల సంఘం డిమాండ్ చేస్తూ పిటషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరగాల్సివుంది. మరి ఈ వివాదంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments