Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తిగత జీవితానికి గట్టి ఎదురుదెబ్బ.. నా ఆశలన్నీ శిథిలం : సమంత

Advertiesment
వ్యక్తిగత జీవితానికి గట్టి ఎదురుదెబ్బ.. నా ఆశలన్నీ శిథిలం : సమంత
, గురువారం, 9 డిశెంబరు 2021 (17:35 IST)
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసున్న హీరోయిన్ సమంత.. ఆ తర్వాత మనస్పల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే, తన విడాకులను జీర్ణించుకోలేని ఆమె అపుడపుడూ తన మనస్సులోని బాధను వెళ్లగక్కుతున్నారు. తాజాగా తాను పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయంటూ కామెంట్స్ చేశారు. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'వాస్తవాలను తెలుసుకోకుండా అసత్యాలను వార్తలు రాయడం భావ్యం కాదన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. ఈ యేడాది నా వ్యక్తిగత జీవితానికి గట్టి ఎదురుదెబ్బతగిలింది. నా ఆశలన్నీ శిథిలమైపోయాయి. 
 
కాలం నా కోసం ఏది రాసిపెడితే దాన్నే ధైర్యంగా స్వీకరిస్తాను. నాపై కందరు అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఓ విధానం ఉంటుంది" అంటూ సమంత వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప పాటలు నాకు చాలెంజ్‌ విసిరాయి- గీత రచయిత చంద్రబోస్‌