Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటుడు బాలాజీపై కిడ్నీ మోసం కేసు.. సీన్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి

సినీ నటుడు బాలాజీపీ కిడ్నీ మోసం కేసు నమోదైంది. దీంతో బాధితురాలికి అండగా నిలబడేందుకు సినీ నటి శ్రీరెడ్డి ముందుకు వచ్చారు. ఫలితంగా ఇది చర్చనీయాంశంగా మారనుంది.

Webdunia
బుధవారం, 9 మే 2018 (14:19 IST)
సినీ నటుడు బాలాజీపీ కిడ్నీ మోసం కేసు నమోదైంది. దీంతో బాధితురాలికి అండగా నిలబడేందుకు సినీ నటి శ్రీరెడ్డి ముందుకు వచ్చారు. ఫలితంగా ఇది చర్చనీయాంశంగా మారనుంది.
 
ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే, సినీ, బుల్లితెర నటుడు బాలాజీ భార్య కృష్ణవేణికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో బాలాజీ కిడ్నీ దాతకోసం సంప్రదిస్తుండగా డబ్బు అవసరమైన భాగ్యలక్ష్మి అనే ఓ మహిళ తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
 
ఈ ఒప్పందంలో భాగంగా ముందస్తుగా రూ.3 లక్షల నగదును భాగ్యలక్ష్మికి బాలాజీ అందజేశాడు. ఆ తర్వాత ఆమె కిడ్నీ దానం చేయడంతో తన భార్యను బతికించుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బు ఇవ్వాలని బాలాజీని కిడ్నీదాత సంప్రదించగా, ఆమెను బెదిరించసాగాడు. దీంతో బాధిత మహిళ జూబ్లీహిల్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న నటి శ్రీరెడ్డి బాధితురాలికి బాసటగా నిలిచారు. ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాలాజీ తన దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలు, బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: జన సైనికులు ఇలాంటి కుట్రలకు దూరంగా ఉండాలి.. పవన్ కల్యాణ్

Google Maps: సముద్రంలోకి కారు.. అలల మధ్య ఇరుక్కుపోయింది.. కారులో ఆ నలుగురు ఎవరు? (Video)

RK Roja: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు ఇచ్చారు.. రోజా ఫైర్

ఒక్క రీల్‌లో అలా పాపులరైన బర్రెలక్కకు పండంటి పాప పుట్టిందోచ్

మెట్రో రైల్లో మహిళ వెనుక నిలబడి ప్యాంట్ జిప్ తీసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments