Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుణ్ జైట్లీకి అస్వస్థత... ఎయిమ్స్‌లో కిడ్నీలకు చికిత్స

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరిలించారు. ఈ ఆస్పత్రిలో ఆయనకు కిడ్నీలకు ఆపరేషన్ చేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే శనివారమే రోజే ఆయ

Advertiesment
అరుణ్ జైట్లీకి అస్వస్థత... ఎయిమ్స్‌లో కిడ్నీలకు చికిత్స
, శనివారం, 7 ఏప్రియల్ 2018 (13:38 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరిలించారు. ఈ ఆస్పత్రిలో ఆయనకు కిడ్నీలకు ఆపరేషన్ చేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే శనివారమే రోజే ఆయనకు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆయన తన అధికారిక విధులకు దూరంగా ఉంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కేవలం ముఖ్యమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరించడంతో ఇంటికే పరిమితం అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన్ను చికిత్స కోసం ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. శనివారం శస్త్రచికిత్స నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించనుంది. సందీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోదరుడు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాపకింద నీరులా తెలుగు నెటిజన్ల ప్రచారం ... కమలనాథులకు నిద్ర కరవు