Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిడ్నీలో రాళ్లు ఇలా కరిగిపోతాయ్

ఈ మధ్య చాలామంది కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నారు. ఈ పరిణామాలకు కారణం మారిన జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం లాంటివి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తం

కిడ్నీలో రాళ్లు ఇలా కరిగిపోతాయ్
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (20:16 IST)
ఈ మధ్య చాలామంది కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నారు. ఈ పరిణామాలకు కారణం మారిన జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం లాంటివి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే.


రక్తంలోని విష పదార్థాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. నేటి జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు త్రాగలేకపోతున్నారు. చాలా సందర్భాలలో ఈ రాళ్లు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా విసర్జించబడతాయి. అయితే కొందరిలో మరీ పెద్దవై మూత్రపిండాల్లో ఉండిపోతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటిని నివారించాలంటే ఇలా చేయాలి.
 
1. కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువుగా నీటిని త్రాగుతూ ఉండాలి. రోజుకి సుమారు 7 నుంచి 10 లీటర్ల నీటిని, ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి. 
 
2. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే త్రాగటం వలన కిడ్నీల్లో ఉన్న రాళ్లు కరిగి పోతాయి.
 
3. అరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జనతో పాటు బయటకు వస్తాయి.
 
4. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమోటా వంటి ఆక్సలేట్ పదార్ధాలు తినకూడదు.
 
5. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహారపదార్ధాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.
 
6. కొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.
 
7. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజూ త్రాగటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాబేజీ రసాన్ని భోజనానికి ముందు తీసుకుంటే..?