Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"అక్షయ తృతీయ" రోజున దానం చేయాల్సినవి.. మజ్జిగ లేదా నీటిని?

వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చిందట. "అక్షయ తృతీయ"నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెప్

, మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:31 IST)
వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చిందట. "అక్షయ తృతీయ"నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి పవిత్ర పర్వదినమైన 'అక్షయ తృతీయ' నాడు ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా ప్రారంభించవచ్చు.
 
పిల్లలను పాఠశాలల్లో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి కార్యాలను చేపట్టవచ్చు. బంగారం, వెండి కూడా కొనొచ్చునని పండితులు సూచిస్తున్నారు. అలాగే గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. 
 
మరోవైపు అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.
 
అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిది. బంగారం, వెండితో పాటు ఎరుపురంగు చీర లేదా ఎరుపురంగు వస్తువులు అనాధలకు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతకు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిదని తద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. అక్షయ తృతీయనాడు పండ్లు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. చెప్పులు, విసనకర్ర, గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది. 
 
ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది. ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాలమరణాలు వంటివి దూరమవుతాయి. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది.
 
గోధుమ బియ్యంతో ప్రసాదం : 
అక్షయ తృతీయ నాడు సంబా గోధుమను బాగా ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలిస్తుంది. కుబేరలక్ష్మి, లక్ష్మీ నారాయణన్, లక్ష్మీ నరసింహ పటాల ముందు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే గోధుమతో చేసే స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చును. 
 
అలాగే పుణ్య తీర్థాల్లో స్నానమాచరించడం వల్ల వేయి గోమాతలను దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా పెద్దలచే ఆశీస్సులు పొందడానికి ఇది ఉత్తమమైన రోజని పండితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం (17-04-18) దినఫలాలు .. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల...