Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోసియేష‌న్లు ఎందుకు పెడ‌తారో అర్థం కాదుః మంచు విష్ణు సెస్సేష‌న‌ల్ కామెంట్‌

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:46 IST)
manchu vishnu
అసోసియేష‌న్లు ఎందుకు పెడ‌తారు. అంతా క‌లిసి ఒక్క‌టిగా వుండేట‌ప్పుడు ఇలా ఒక‌టికి రెండు అసోసియేష‌న్లు పెట్టి ఏంచేస్తారు. అని నాకు వారిపై మంచి అభిప్రాయం వుండేది. విదేశాల్లో వున్న తెలుగువారు అంతా ఒక్క‌టేగ‌దా. మ‌రి సింగ‌పూర్‌లో తెలుగు అసోసియేష‌న్, మ‌రో అసోసియేష‌న్‌. అలాగే ఇత దేశాల్లో ఒక‌టికి రెండు, మూడు అసోసియేష‌న్లు వుంటాయి. ఎందుకు ఇలా పెడ‌తార‌ని వారిపై నాకు దుర‌భిప్రాయం వుండేది. కానీ నాకు వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చిన స‌మ‌స్య వ‌ల్ల అలాంటి అసోసియేష‌న్‌లు ఇందుకోసం పెడ‌తారా అనిపించింది. అంటూ త‌న అనుభ‌వాన్ని వెల్ల‌డించాడు మంచు విష్ణు.
 
వివ‌రాల్లోకి వెళితే, అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో మంచు విష్ణు గెస్ట్‌గా వ‌స్తే ఆయ‌న ప‌లు విష‌యాలు అడిగారు  మంచు విష్ణు భార్య విన్నీ కుటుంబీకులకు కేన్స‌ర్ ఆప‌రేష‌న్ నిమిత్తం సింగ‌పూర్‌ వెళ్ళారు. అంద‌రూ తిరిగి వ‌చ్చారు. రెండురోజులు ఆగాక వ‌స్తాన‌ని విన్నీ అంది. అలా  విన్సీ పిల్ల‌ల‌తో అక్క‌డే వుంది. స‌రిగ్గా ఆ టైంలో క‌రోనా లాక్‌డౌన్ వ‌చ్చింది. ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేస్తారో తెలీదు. పిల్ల‌ల‌తో ఒక్క‌తే అక్క‌డ వుంది. కానీ అక్క‌డ తెలుగు అసోసియేష‌న్లు, నాన్న అభిమానులు, స్నేహితులు, తోటి న‌టులు నా కుటుంబానికి చాలా సాయ‌ప‌డ్డారు. ఫైన‌ల్‌గా కొద్దిరోజుల‌కు తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ త‌ర్వాత ఆలోచిస్తే, అసోసియేష‌న్‌పై వున్న దుర‌భిప్రాయం తొల‌గిపోయింది. అందుకే నేను కూడా ఏదో ఒక‌టి చేయాల‌ని మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పోటీలో దిగాను అని తెలిపారు.
 
`మా` అసోసియేష‌న్ పోటీ అవ‌స‌ర‌మా?
ఈ ప్ర‌శ్న‌కు మంచు విష్ణు తెలివిగానే స‌మాధానం ఇచ్చారు. మ‌న‌కు ఎంతోమంది దేవుళ్ళు వున్నారు. ఎవ‌రికి న‌చ్చిన దేవుడ్ని వారు పూజిస్తారు. అలాగే అసోసియేష‌న్‌లో పోటీ వుంటుంది. ఎవ‌రుకు న‌చ్చిన వ్య‌క్తిని వారు ఎన్నుకొనే హ‌క్కు మ‌న దేశంలోనే వుంది క‌దా. అంటూ స‌మాధాన‌మిచ్చారు. ఒక‌వేళ అధ్య‌క్షుడు అయితే నేను న‌మ్మిన మంచి ప‌నులు చేస్తాన‌ని అదే ధైర్యంతో పోటీ చేస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments