Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బుల్లెట్ సత్యం' టైటిల్- సాంగ్ లాంచ్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (16:05 IST)
సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దేవరాజ్, సోనాక్షి వర్మ హీరోహీరోయిన్లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న 'బుల్లెట్ సత్యం' చిత్రం యొక్క టైటిల్, లిరికల్ వీడియో సాంగ్‌ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా వచ్చిన నిర్మాత రాజకందుకూరి, డైరెక్టర్ వీర శంకర్, దేవి ప్రసాద్, సంజయ్ రెడ్డిలు చిత్రం యొక్క లిరికల్ సాంగ్ విడుదల చేసారు.
 
అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. ఈ చిత్రానికి రాంబాబు గారు చక్కటి సాహిత్యాన్ని అందించారు. మంచి సినిమాలకు మంచి లిరిక్ రైటర్ ఎంతో అవసరం. దేవరాజ్ గారు కరోనా టైంలో ముందుకు వచ్చి చిత్రాన్ని నిర్మించడమే కాక హీరోగా నటించారు. ఇలాంటి వారు ఇండస్ట్రీ కు ఎంతో అవసరం. డైరెక్టర్ మధుకు ఇది రెండవ చిత్రం. హీరోయిన్‌గా చేసిన సోనాక్షికి ఆల్ ద బెస్ట్ అని చెప్పారు.
 
దేవిప్రసాద్ మాట్లాడుతూ, "బుల్లెట్ సత్యం టైటిల్ చాలా బాగుంది. రాంబాబు మంచి పాటలు రాశారు. యాజమాన్యం మంచి సంగీతం అందిచారు. చిన్న మూవీ అయినా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మూవీకి మంచి విజయం దక్కాలని అన్నారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, "టైటిల్ చాలా క్యాచీగా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథ, పాయింట్ బాగుండి రీజనబుల్ టేకింగ్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా" ఆదరిస్తారు.
 
సంజయ్ రెడ్డి మాట్లాడుతూ, 'జార్జ్ రెడ్డి'లోని బుల్లెట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ బుల్లెట్ సత్యం కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని అన్నారు. చిత్ర నిర్మాత, హీరో దేవరాజ్ మాట్లాడుతూ, "ఈ చిత్రం యొక్క కథ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సాగుతుంది. నేను ఈ చిత్రంలో మొదటిసారిగా హీరోగా నటించాను. మీరందరూ నన్ను ఆదరించి ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
హీరోయిన్ సొనాక్షి వర్మ మాట్లాడుతూ, నా పేరు సోనాక్షివర్మ నేను ఇండస్ట్రీకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది. నేను యాడ్‌లు, షాట్ ఫిలిమ్స్‌లో నటించాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు.
 
మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య మాట్లాడుతూ, బుల్లెట్ సత్యం సాంగ్స్ పాటలు జనాల్లోకి బుల్లెట్ లాగా దూసుకు పోతున్నాయి. పాటల్లాగే సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు. లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ, "ఈ చిత్రంలో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇందులో.ప్రతి పాట సందర్భానుసారంగా వచ్చాయి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావాలని" కోరుకుంటున్నాను.
 
డైరెక్టర్ మధు మాట్లాడుతూ, "ఇది నాకు రెండవ చిత్రం, విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథ ఈ చిత్రం లోని సాంగ్స్ అన్ని బాగుంటాయి. వచ్చే నెల సినిమా థియేటర్లు ఓపెన్ అయితే గ్రాండ్ రిలీజ్ చేద్దామని చూస్తున్నాము. ఈ చిత్రం ఎక్కడ కూడా సినిమాటిక్‌గా ఉండదు. రియాలిస్టిక్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు చక్కగా నటించారు. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు.
 
చంద్ర కిరణ్ మాట్లాడుతూ, "ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు." తెలిపారు. నటీనటులు: దేవరాజ్, సోనాక్షి వర్మ, వినోద్ కుమార్, మోనా తాకుర్, సంజయ్ రెడ్డి, చంటి, ధన్ రాజ్, అప్పారావు, శివలీల, సత్తెన్న, వాసు, రాకేష్, చేతన్.
 
టెక్నీషియన్స్
డైరెక్టర్: మదు గోపు,
నిర్మాత: పోతూరి పవిత్ర,
మ్యూజిక్: వినోద్ యాజమాన్య,
డిఓపి :జిఎల్ బాబు,
ఎడిటర్: ఎస్బి ఉద్ధవ్,
కొరియోగ్రఫీ: చంద్ర కిరణ్,
లిరిక్స్: రాంబాబు గోషాల,
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ,
రచన-సహకారం: సంజయ్ బంగారపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments