Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బ్రో చిత్ర ప్రదర్శనకు ఆటంకాలు.. కావలిలో నిలిపివేత.. గూడూరులో ఉద్రిక్తత!

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (14:48 IST)
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "బ్రో". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు, సినిమా థియేటర్ల వద్ద ఆయన అభిమానుల సందడి హద్దులు దాటిపోయింది. మరోవైపు, ఏపీలోని పలు ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కావలిలోని లతా థియేటర్‌లో సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 
 
కావలిలోని లతా థియేటర్‌లో సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. దీంతో యాజమాన్యం షో ప్రదర్శనను నిలిపివేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద రచ్చ రచ్ చేసఆరు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కు థియేటర్ యజమాన్యానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
 
మరోవైపు, గూడూరులో సింగం థియేటర్ వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సినిమా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పవన్ ఫ్యాన్స్‌ రెండు వర్గాలుగా చీలిపోయి గొడవకు దిగారు. దీంతో థియేటర్ యాజమాన్యం కల్పించుకుని ఇరువర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య పవన్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో రెండు వర్గాలు కలిసి మూకుమ్మడిగా థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో థియేటర్ యాజమాన్యం మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments