Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బ్రహ్మాస్త్ర'' నుంచి లోగో విడుదల.. (వీడియో)

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:26 IST)
బ్రహ్మాస్త్ర సినిమా నుంచి తెలుగు లోగో విడుదలైంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ లోగో బాలీవుడ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు లోగోను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 
 
ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని జక్కన్న ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం వచ్చే క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
కాగా బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత అన్ని ఇండస్ట్రీస్‌లో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోవలో బాలీవుడ్‌లో 'బ్రహ్మాస్త్ర' అనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
 
''ఈ వీడియోలో బ్రహ్మాస్త్రం గురించి.. రణ్‌వీర్ కపూర్ అడుగుతుంటాడు. దానికి నాగార్జున అదే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా నింపుకున్న అద్వితీయ అస్త్రం బ్రహ్మాస్త్రం గురించి చెబుతాడు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments