Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కరాళనృత్యం.. స్వీయ నిర్బంధంలో సినీ సెలెబ్రిటీలు

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (09:05 IST)
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దీంతో కేంద్రంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, విద్యా సంస్థలతో పాటు.. 144 సెక్షన్‌ను సైతం అమలు చేస్తోంది. దీంతో ఈ వైరస్ దెబ్బకు ప్రజలంతా భయంతో వణికిపోతూ, బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఈ కోవలో తొలుత బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ తన ఇంట్లోనే ప్రత్యేక గదిలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అలాగే, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కూడా స్వచ్చంధంగా నిర్బంధంలోకి వెళ్లారు. 
 
తన చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ ముద్ర ఉన్న ఫొటోను అమితాబ్ ట్విట్టర్‌ ద్వారా ప్రపంచానికి పంచుకున్నారు. కరోనా లక్షణాలు గుర్తిస్తే బయటకు రాకండి, వైద్యులను సంప్రదించండి అని పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే, హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్‌ ‘క్యారంటైన్‌ తొలి రోజు’ అంటూ స్విమ్మింగ్‌ఫూల్‌లో సేదతీరుతున్న ఫొటోలనుపంచుకున్నది. ప్రణీత స్వీయ నిర్బంధపు సమయంలో వర్కవుట్స్‌కు మాత్రం దూరం కాలేదు. యోగా చేస్తూ కనిపించింది. యోగా రోగనిరోధకశక్తిని పెంచుతుందని ప్రణీత చెప్పింది.
 
టాలీవుడ్ హీరో ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం జార్జియా వెళ్లిన ప్రియదర్శి ఇటీవలే ఇండియా వచ్చారు. కరోనా స్క్రీనింగ్‌ను పూర్తిచేసుకున్న ఆయన తనకు తాను క్లీన్‌చీట్‌ ఇచ్చుకోవడం కోసం 14 రోజులు ఇంట్లోనే  ఉంటానని వెల్లడించారు. శ్రద్ధాదాస్‌ క్యారంటైన్‌లోనే ఉన్నానని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments