Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు సలీం గౌస్ కన్నుమూత

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (18:23 IST)
Salim Ghouse
బాలీవుడ్ నటుడు సలీం గౌస్ కన్నుమూశారు. సినీ నటుడిగానూ ప్రముఖ టీవీ నటుడు సలీం గౌస్ 70 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. సలీంకు మంచి నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషిగా బాలీవుడ్‌లో పేరు ఉంది.  
 
సలీం మృతితో బాలీవుడ్‌లో విషాద చాయలు అలముకున్నాయి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన సలీం మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1952 జనవరి 10 చెన్నైలో జన్మించారు సలీం. నాటకరంగంలో అడుగులువేస్తూ.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ పెద్ద నటుడిగా ఎదిగారు. 
 
1978లో సలీమ్‌కు సినిమా అవకాశం లభించింది. స్వర్గ్ నరక్ సినిమాతో తన ఫిల్మ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన సలీం. ఆతరువాత చక్ర, సారాంశ్, మోహన్ జోషీ హజీర్ హో లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
రాముడు, కృష్ణుడు, టిప్పు సుల్తాన్ లాంటి ఎన్నో ప్రముఖ పాత్రలు పోషించిన సలీం.. శ్యామ్ బెనగల్ లాంటి అగ్రహీరోలతో కూడా పనిచేశారు. ముఖ్యంగా సలీమ్ కు సుబా అనే టీవీ సీరయల్ వల్ల బాగా పేరు వచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments