Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టిన "కేజీఎఫ్-2"

Advertiesment
kgf-2
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (14:14 IST)
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం "కేజీఎఫ్ - చాఫ్టర్ 2". ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజునే బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్ధలుకొట్టింది. తొలి రోజున ఏకంగా రూ.53.95 కోట్లను వసూలు చేసి, గత రికార్డులను బ్రేక్ చేసింది.
 
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కన్నడం, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై తొలి రోజున భారీగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా, హిందీలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. 
 
తొలి రోజున "కేజీఎఫ్-2" చరిత్ర సృష్టించింది. గతంలో "వార్", "థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్" సినిమాలు మొదటి రోజు వసూళ్లను సృష్టించిన రికార్డులను కేజీఎఫ్ బద్ధలు కొట్టింది. 
 
"కేజీఎఫ్-2" తొలి రోజున రూ.53.93 కోట్లు వసూలు సాధించింది. గతంలో "వార్" చిత్రం తొలి రోజున రూ.51.60 కోట్లు వసూలు చేయగా, ఆ తర్వాత స్థానంలో "థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్" చిత్రం రూ.50.75 కోట్లు సాధించిన విషయాన్ని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి... స్పందించిన కత్రినా కైఫ్