కె.జి.ఎఫ్. సినిమా అనేది మా ఎనిమిదేళ్ళ కష్టం. కన్నీళ్ళు, సంతోషాలు, గాయాలు, వందలాది మంది శ్రమ ఇదంతా వృధాగా పోనీయకండి.. అంటూ చిత్ర యూనిట్ ప్రేక్షకులను అభ్యర్థిస్తోంది. రేపు అనగా శుక్రవారంనాడు విడుదలకానున్న ఈ సినిమా గురించి ఈ సాయంత్రమే రిక్వెస్ట్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది.
యశ్ ఫొటోతో కూడిన ఈ పోస్టర్‌లో యశ్ శ్రమ, కృషి, కన్నీళ్ళు, సంతోషాలు, బాధలు అన్ని ఇమిడి వుండేలా సందేశం చూపించారు. పైరసీకి వ్యతిరేకంగా పోరాటం మీతో ప్రారంభమవుతుంది! దయచేసి వీడియోలు & ఫోటోలు తీయకండి మరియు వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవద్దు! పైరసీకి నో చెప్పండి. అంటూ అందులో పేర్కొన్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలు రూపొందింది. మొదటి భాగానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కెజి.ఎఫ్.2 అనేది పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతుంది. అన్ని భాషల నటీనటులు ఇందులో నటించారు. హోంబళే ఫిలింస్ భారీగా నిర్మించింది.