Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌త్య‌దేవ్ గాడ్సే చిత్రం విడుద‌ల తేదీ ఖ‌రారు

Advertiesment
Satyadev
, బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:14 IST)
Satyadev
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక టీజ‌ర్‌తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాను మే 20న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత సి.క‌ళ్యాణ్ తెలిపారు. గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపి గ‌ణేష్ అందిస్తున్నారు.
 
గాడ్సే సినిమా రిలీజ్ డేట్‌ను తెలియ‌జేసే పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ మే 20న విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే కోటు వేసుకున్న‌ స‌త్య‌దేవ్ రెండు చేతుల్లో రెండు పిస్ట‌ల్స్ ప‌ట్టుకుని ఇన్‌టెన్స్‌గా చూస్తున్నారు. అత‌ని నుదుటిపై గాయమైంది.
 
అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుడిని, వ్య‌వ‌స్థ‌ను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది.
 
ఈ చిత్రాన్ని సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. నాజ‌ర్‌, షాయాజీ షిండే, కిషోర్‌, ఆదిత్య మీన‌న్‌, బ్ర‌హ్మాజీ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికన్ కమెడియన్ గిల్బర్ట్ గాట్ ఫ్రైడ్ కన్నుమూత