Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీలో కేజీఎఫ్ 2 కలెక్షన్ల ప్రభంజనం.. బాలీవుడ్‌కే టఫ్ ఇచ్చిన యష్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (17:28 IST)
కేజీఎఫ్ 2 దేశవ్యాప్తంగా ప్రభంజనం కొనసాగుతోంది. ఇంకా అన్ని బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేస్తోంది. దంగల్‌ను దాటేసింది. తాజాగా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా 'కేజీఎఫ్ 2' నిలిచింది. ఇంతకుముందు టైగర్ జిందా హై, పీకే, సంజు చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించాయి.
 
ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 శుక్రవారం రూ. 11.56 కోట్లు, శనివారం రూ. 18.25 కోట్లు, ఆదివారం రూ. 22.68 కోట్లు, సోమవారం రూ. 8.28 కోట్లు, మంగళవారం రూ. 7.48 కోట్లు, బుధవారం రూ. 6.25 కోట్లు కొల్లగొట్టింది. అంటే హిందీ వెర్షన్ మెుత్తం రూ. 343.13కోట్లు వసూళ్లు వచ్చాయి.
 
ఫలితంగా 11 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ సెంచరీని సాధించింది. 2019 సంవత్సరం తర్వాత 300 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా నిలిచింది. అలాగే కేజీఎఫ్ 2 వసూళ్ల సునామీ పదిహేనవ రోజు కూడా కొనసాగుతుంది. ఈ సినిమా 15వ రోజు 10 కోట్లు రాబట్టింది.  
 
సినిమా టోటల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా ఇండియాలో ఇప్పటివరకు 684.71 కోట్లు సాధించింది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, విజయ్ కిరుగందూర్ నిర్మించారు. ఈ చిత్రంలో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, బాలకృష్ణ, అనంత్ నాగ్, మాళవిక అవినాష్, శరణ్ శక్తి, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments