Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు బొమ్మ ప్రణీతను వరిస్తున్న బాలీవుడ్ ఆఫర్లు..

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (18:21 IST)
బెంగళూరు భామ ప్రణీతకు టాలీవుడ్‌లో అంతగా ఆఫర్లు రావట్లేదు. అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత ఆమెకు ఆఫర్లు అతకడం లేదు. తాజాగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ప్రణీతకు.. బీటౌన్‌లో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో పాటు.. విష్ణు, మనోజ్, సిద్ధార్థ్ వంటి కథానాయకులతోనూ నటించిన ప్రణీతను బాలీవుడ్ అవకాశాలు వరిస్తున్నాయి.
 
ప్రస్తుతానికి బాలీవుడ్‌లో మాత్రం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అందులో ఒకటి అజయ్‌ దేవగణ్‌తో 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా' కాగా.. మరొకటి పరేష్ రావెల్, శిల్పా శెట్టిల 'హంగామా-2'. ఈ రెండు సినిమాలలోనూ ప్రాధాన్యత గల పాత్రలలో కనిపించబోతుందట ఈ బెంగళూరు భామ.
 
ఈ సినిమాలతో పాటు లేటెస్ట్‌గా మరో బాలీవుడ్ ఆఫర్ ప్రణీత చెంతకు వచ్చిందట. 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో కీలక పాత్రకే పరిమితమైన ప్రణీత.. ఈసారి అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్‌గా నటించే ఆఫర్ చేజిక్కించుకుందట. త్వరలోనే.. అజయ్-ప్రణీత మూవీపై అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా.. బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో బిజీ అవుతోన్న ప్రణీతకు.. హిందీ చిత్ర పరిశ్రమ ఎలా కలిసొస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments