Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారెన్స్‌ను అలా అవమానించిన బాలీవుడ్...

Webdunia
గురువారం, 23 మే 2019 (22:23 IST)
కాంచన-3 సినిమా హిట్టయ్యిందన్న ఆనందం కాంచనతోనే ఆవిరైపోయింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టాలన్న నిర్ణయంపై నిర్మాతలు నీళ్ళు చల్లారు. ఆత్మాభిమానం అడ్డుతగలడంతో హిందీ సినిమా నుంచి బయటకు వచ్చేశాడు లారెన్స్. లారెన్స్ సెల్ఫ్ రెస్పెట్‌ను ఎవరు డామేజ్ చేశారు. 
 
కాంచన సిరీస్ లారెన్స్‌కు ఒక మంచి పేరునే తెచ్చిపెట్టింది. వరుసగా వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ రేటే హిందీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. కాంచన్ సినిమాతో దర్సకుడిగా హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు లారెన్స్. లారెన్స్ నటించిన పాత్రను హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
 
కైరా అద్వానీ హీరోయిన్. ఈ మధ్యనే సినిమా ప్రారంభమైందో లేదో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేశారు. లారెన్స్‌ను సంప్రదించకుండా నిర్మాతలు రిలీజ్ చేసేశారు. దీంతో దర్శకుడు హర్టయ్యి సినిమా నుంచి తప్పుకున్నారు. అజయ్ దేవగన్ నటిస్తున్న లక్ష్మీ బాంబ్ సినిమా నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు లారెన్స్.
 
డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే లక్ష్మిబాంబ్ సినిమా నుంచి తప్పుకున్నాను. నాతో చర్చింకుండా నా ప్రమేయం లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ దర్శకుడికి రాకూడదంటున్నారు లారెన్స్. దర్శకుడిగా తప్పుకున్నంత మాత్రాన నా స్క్రిప్ట్‌ను ఇచ్చేయమని అడుగను. అలాగని దర్శకుడిగా కొనసాగలేను. అక్షయ్ అంటే నాకు ఎంతో అభిమానం. త్వరలో ఆయన్ను కలిసి విషయం చెబుతాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నాడు లారెన్స్. మరి దీనిపై అక్షయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments