Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెహ్వాల్‌గా శ్రద్ధా కపూర్... మరో బయోపిక్ షూటింగ్ స్టార్ట్

బాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులో కూడా క్రీడాకారుల జీవితాలకు సంబంధించిన సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. తాజాగా మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా మరో బయోపిక్ సినిమా తెరకెక్కనుం

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:39 IST)
బాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులో కూడా క్రీడాకారుల జీవితాలకు సంబంధించిన సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. తాజాగా మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా మరో బయోపిక్ సినిమా తెరకెక్కనుంది.
 
సైనా నెహ్వాల్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు "సైనా" అనే టైటిల్‌ను ఖరారు చేసారు. శ్రద్ధా కపూర్ 'సాహో' సినిమా చివరి షెడ్యూల్‌లో బిజీగా ఉండటంతో అది పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా టి-సిరీస్ అధినేత భూషణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్‌లలో శ్రద్ధా కపూర్ ఒకరు కావడం వల్ల ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు. మరి "సైనా"కు శ్రద్ధా కపూర్ ఎంతమేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments