Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ టాప్-10 శాఖాహార సెలెబ్రిటీలు ఎవరు?

వివిధ రకాల వ్యాధులకు దూరంగా ఉండేందుకు ఇపుడు ప్రతి ఒక్కరూ శాఖాహారం జపం చేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు అయితే తమ ఆహార విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకుంటున్నారు. మాంసాహారాన్ని దూరంపెట్టేసి... శాఖాహారంపై

బాలీవుడ్ టాప్-10 శాఖాహార సెలెబ్రిటీలు ఎవరు?
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:00 IST)
వివిధ రకాల వ్యాధులకు దూరంగా ఉండేందుకు ఇపుడు ప్రతి ఒక్కరూ శాఖాహారం జపం చేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు అయితే తమ ఆహార విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకుంటున్నారు. మాంసాహారాన్ని దూరంపెట్టేసి... శాఖాహారంపై అమితాసక్తి చూపుతున్నారు. గతంలో అలా బాలీవుడ్‌లో మాంసాహారులుగా ఉండి ఇపుడు శాఖాహారులుగా మారిన టాప్-10 సెలెబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.
 
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. ఈమె పెటా సంస్థ నుంచి హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీగా టైటిల్ అందుకున్నారు. పైగా, జీవహింసను అరికట్టాలని ఎన్నో రోజులుగా ప్రచారం చేస్తున్నారు. మూగజీవాల హక్కుల కోసం తనవంతుగా పోరాటం చేస్తున్నారు. 
 
సీనియర్ బాలీవుడ్ నటి రేఖ. బాలీవుడ్ యోగినిగా కూడా ఈమెకు మంచిపేరుంది. ఈమె పూర్తి శాఖాహారి. తనకూ ఇప్పటికీ డయాబెటిస్‌లాంటి వ్యాధులురాకుండా ఉండటానికి కారణం తాను వెజిటేరియన్ కావడమే అని ఆమె గొప్పగా చెబుతుంటారు. 
 
ఒకప్పుడు మాంసాహారం అంటే లొట్టలేసుకుని ఆరగించే నటి విద్యాబాలన్.. ఇపుడు తన డైటీషియన్ సలహా మేరకు పూర్తిస్థాయి వెజిటేరియన్‌గా మారిపోయారు. 
 
పుట్టుకతోనే మాంసాహారి అయిన అలియా భట్.. 'ఉడతా పంజాబ్' అనే సినిమా షూటింగ్ సెట్‌లో తొలిసారిగా తాను వెజిటేరియన్‌గా మారుతున్నానని ప్రకటించారు. తనకు ప్రేరణగా నిలిచిన తండ్రి మహేష్ భట్‌కి ధన్యవాదాలు తెలిపారు. 
 
బాలీవుడ్ బోల్డ్ స్టార్ కంగనా రనౌత్ కూడా ఎన్నో ఏళ్లుగా మాంసాహారిగా ఉన్నారు. అయితే ఆమె మనసు ఆధ్యాత్మిక వైపు మళ్లడంతో మాంసానికి దూరమై శాఖాహారాన్నే ఆరగిస్తున్నారు. 
 
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా శాఖాహారిగా మారిపోయారు. ఈయన 1982లో "కూలీ" సినిమా షూటింగులో గాయాల బారిన పడ్డారు. అపుడు మాంసాహారంతో పాటు మద్యపానానికి కూడా స్వస్తిపలికారు. ఇపుడు నిఖార్సయిన శాకాహారిగా మారిపోయారు. 
 
చిన్నప్పటి నుంచి మాంసాహారమంటే పడిచచ్చిన వివేక్ ఒబెరాయ్.. 2009 సంవత్సరం నుండి తన తండ్రి ప్రేరణతో శాకాహారిగా మారిపోయారు.
 
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్టుగా పేరుగాంచిన అమీర్ ఖాన్.. ఒకప్పుడు నాన్ వెజిటేరియన్. ఈయన భార్య కిరణ్ రావ్ ప్రేరణతో వెజిటేరియన్‌గా మారిపోయారు. 15 రకాల రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే వెజిటేరియన్ కావాల్సిందే అని తన భార్య కిరణ్ చూపిన వీడియోను చూసి అమీర్ పూర్తిగా మారిపోయారు. 
 
మాంసాహారం కంటే శాకాహారంలోనే ఎక్కువ బలం ఉంటుందని నమ్మే నటుడు సోనూ సూద్. కానీ ఆయన గతంలో ఎక్కువగా కోడిగుడ్లు తినవారట. తర్వాత వాటికి కూడా స్వస్తి పలికారు. తన ఫిట్నెస్ కోసం ఆహారంలో మార్పులు చేసుకున్న ఆయన ఎక్కువగా చిరుధాన్యాలు, సలాడ్స్, రోటీ తినడానికి ఇష్టపడతానని అంటున్నారు. మాంసాహారానికి దూరమయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌరీగుట్టపై శ్రీ గౌతమేశ్వరుడు... ఆలయ విశిష్టతలు ఏమిటి?