Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరి ఆశీస్సులున్నాయి. ఎవరు ఆపుతారో చూస్తా?- విజయ్ దేవరకొండ

Vijay-Ananya
Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:47 IST)
Vijay-Ananya
అందరి ఆశీస్సులు ఉన్నాయి. లైగ‌ర్ సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా?...అంటూ గ‌త కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న బాయ్ కాట్ లైగర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ. ఢిల్లీలో ఆయ‌న మీడియా ముందు మాట్లాడారు.
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లైగర్ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో గాయంతో బ్యాక్ పెయిన్ ఉన్నా...సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సినిమా కోసం ఇంత కష్ట పడ్డాం..ఇప్పుడు రిలాక్స్ అయితే ఎలా అని ఇటీవల హైదరాబాద్ ప్రెస్ మీట్ లో విజయ్ చెప్పడం సినిమా మీద ప్యాషన్, ప్రమోషన్స్ మీద ఆయనకున్న కమిట్ మెంట్ చూపిస్తోంది. ఇక ఎక్కడికి వెళ్లినా ఆయన క్రేజ్ కనిపిస్తోంది. చాలా చోట్ల క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ అవుతున్నాయి.
 
సినిమా రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లో  మిగతా అందరు స్టార్స్ సినిమాల్లాగే బాయ్ కాట్ లైగర్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. బాయ్ కాట్ లైగర్ పై ఇవాళ ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో మరోసారి గట్టిగా స్పందించారు విజయ్ దేవరకొండ . ఆయన మాట్లాడుతూ...నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది, ప్రజల ప్రేమాభిమానాలు ఉన్నాయి, దేవుడి కృప ఉంది. గెలవాలనే ఫైర్ లోపల ఉంది. ఇక మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాను. అంటూ బలమైన కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments