తన తండ్రికి కొడుకు శుభాకాంక్షలు తెలపడం మామూలే. తనను పెంచి పెద్ద చేసి దేశంలో పేరు వచ్చేలా స్థాయికి చేరేలా తీర్చిదిద్దిన తన తండ్రికి కొడుకు శుభాకాంక్షలు చెప్పడం విశేషమే మరి. అందుకే ఉత్తమ తండ్రి అయిన మెగాస్టార్ చిరంజీవి జన్మదినమైన నేడు ఆయన కుమారుడు రామ్‌చరన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఇద్దరూ తెల్లటి దుస్తులు ధరించి మెగా అభిమానులను ఫిదా చేశారు.
ఇరువురూ ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అభిమానులూ ఆదరించారు. నేడు చిరంజీవికి పలువురు సినీప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఆర్.ఆర్.ఆర్. సినిమాతో చేరిన తన కొడుకు రామ్‌చరణ్ శుభాకాంక్షలు తెలియజేయడం తండ్రిగా ఆయన ఆనందం వర్ణించలేనిది. అందుకే రామ్‌చరణ్... ప్రపంచంలోని అత్యుత్తమ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. రామ్‌చరణ్ `ఆర్.సి.15` అనే సినిమాతో శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, చిరంజీవికి కొడుక్కు పోటీగా నాలుగు సినిమాల్లో బిజీగా వున్నారు.