రూ.20లక్షలు వద్దనుకున్న వరుణ్.. పార్టీ చేసుకున్న రాహుల్.. పునర్నవి..?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (10:49 IST)
టాలీవుడ్ తారలతో బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ సందడిగా ముగిసింది. టాప్ ఫైవ్‌లో మొదట అలీ రెజా ఎలిమినేట్‌ కాగా.. ఆ తర్వాత నాగార్జున రూ.10లక్షలు ఆఫర్‌ ఉందని... ఎవరైనా వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చని కోరగా ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత మరో రూ.10లక్షలు కలిపి, మొత్తం రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అయినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వరుణ్‌ సందేశ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. 
 
దీంతో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో తన ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తనని ఇన్నిరోజుల పాటు ప్రోత్సహిస్తూ వచ్చిన తన అభిమానులు, ప్రేక్షకుల కోసమే తాను రూ.20లక్షలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు.. 20 లక్షలు అలా తీసుకుని ఉంటే తనపై వారు చూపించిన అభిమానానికి విలువ ఉండదని వరుణ్‌ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. టైటిల్‌ను గెలిచిన సందర్భంగా రాహుల్, వరుణ్ పార్టీ చేసుకున్నారు. వారిద్దరి ఫోటోలను, వీడియోను పునర్నవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్, వరుణ్‌లు ఒకరిమీద ఒకరు పడుతూ.. బ్రోమాన్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments