బిగ్ బాస్ మూడో సీజన్ ముగియడానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలివున్నాయి. ఈ నేపథ్యంలో కంటిస్టెంట్లకు బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఇందులో భాగంగా పద్నాలుగు వారాలపాటు ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురానున్నారు. వీరి అల్లరితో ఎపిసోడ్ దద్ధరిల్లింది. తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఎలిమినేట్ అయిన కంటిస్టెంట్లు రచ్చ రచ్చ చేశారు.
తాజా ప్రోమో ద్వారా హేమ జాఫర్, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టారో మళ్లీ అంతా అక్కడికే చేరినట్టు కనిపిస్తోంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ, శివజ్యోతి మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. బాబా అంటూ జాఫర్ రాగా, గురువుగారూ అంటూ బాబా హత్తుకున్నాడు.
ఈ ప్రోమోలో ఇంకా పునర్నవిని చూసిన ఆనందంలో శ్రీముఖి ఆమెను ఎత్తేసుకుంది. ఆపై శ్రీముఖి అతివినయం చూపిస్తూ హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ 'వద్దమ్మా' అంటూ ఆమెకో నమస్కారం పెట్టింది. ఆ సందర్భంగా రాహుల్ అక్కా నువ్వు తోపు అంటూ సెటైర్ వేశాడు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌తో ఎలిమినేషన్ అయిన కంటిస్టెంట్స్‌తో హౌస్‌లో వున్న కంటిస్టెంట్లు చేసే సందడి ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఈ ప్రోమోను మీరూ ఓ లుక్కేయండి.